BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 06:12 pm
Posted by : MUSUGU GOPI

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఏపీ తీరానికి తుఫాన్ ముప్పు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
14 Nov, 2026 - 06:12 PM
11 వీక్షణలు

ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం.. 18 నాటికి తీవ్ర తుఫాన్‌గా బలపడే సూచనలు.. 20న తీరం దాటే ఛాన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం రానున్న రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుందని, అనంతరం తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని సమాచారం.

అంచనాల ప్రకారం, రేపటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 16 నాటికి తుఫాన్‌గా మారవచ్చని, 18వ తేదీ ఉదయానికి తీవ్ర తుఫాన్ స్థాయికి చేరుకునే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. తుఫాన్‌గా మారిన తర్వాత దీనికి ‘అక్వాన్’ (AQUAN) అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ తీరానికి తుఫాన్ ముప్పు?

నవంబర్ 16 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం.. 18, 19 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది నవంబర్ 15 నాటికి వాయుగుండంగా, 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. తుఫాన్‌గా మారితే దీనికి ‘అక్వాన్‌’ (Akvan) అనే పేరు పెట్టనున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ వ్యవస్థ తొలుత వాయువ్య దిశగా కదులుతూ, ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. పలు వాతావరణ నమూనాలు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదలికను సూచిస్తున్నప్పటికీ, తుఫాన్ ప్రయాణ దిశ, తీవ్రత, తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత లేదని ఐఎండీ వెల్లడించింది.

ఈ నెల 18, 19 తేదీల్లో కోస్తాంధ్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తీరానికి తిరిగి రావాలని అధికారులు హెచ్చరించారు.

తుఫాన్ కదలిక, తీవ్రత, ప్రభావిత ప్రాంతాలపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే నవంబర్ 20న తుఫాన్ తీరం దాటుతుందన్న అంచనాపై ఐఎండీ నుంచి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని సూచిస్తున్నారు.