BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మైనర్‌పై లైంగిక దాడి కేసులో నిందితుడికి జీవిత ఖైదు బాధితురాలికి రూ.50 వేల పరిహారం.. రూ.4 వేల జరిమానా విధించిన ప్రత్యేక పోక్సో కోర్టు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Oct, 2026 - 07:42 PM
14 వీక్షణలు

 హైదరాబాద్: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసును విచారించిన ఎల్‌బీనగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు రూ.4,000 జరిమానా విధించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.50,000 పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ తీర్పు వెలువడింది. చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, లైంగిక నేరాల బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు కృషి చేస్తున్నారని మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు. మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా కేసుల దర్యాప్తు, న్యాయపరమైన చర్యలను పకడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు.