న్యాయవాదుల సంక్షేమ డిమాండ్లపై మధిర బార్ అసోసియేషన్ ధర్నా
న్యాయవాదుల సంక్షేమ డిమాండ్లపై మధిరలో ధర్నా
మధిర: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) జాతీయ కౌన్సిల్ పిలుపు మేరకు న్యాయవాదుల సంక్షేమ డిమాండ్ల సాధన కోసం మధిర కోర్టు ఎదుట బుధవారం న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. న్యాయవాదుల డెత్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రూ.25 లక్షలకు పెంచాలని, న్యాయవాదులందరికీ వైద్య సహాయం కింద రూ.5 లక్షలు అందించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు స్టైఫండ్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిశీలించి అమలు చేయాలని ధర్నాలో పాల్గొన్న న్యాయవాదులు కోరారు. న్యాయవాదుల వృత్తిలో ఎదురవుతున్న ఆర్థిక, వైద్యపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షులు చావలి రామరాజు, ఐలూ నాయకులు, సీనియర్ న్యాయవాది దిరిశాల జగన్మోహన్ రావు, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, చింతల గోపాల్, వాసంశెట్టి కోటేశ్వరరావు, సతీష్, కోట జ్ఞానేష్, బోజెడ్ల పుల్లారావు, విజయ్ కుమార్, పుట్టా శ్రీనివాస్, మేడా గోపీనాధ్, మాధురీ తేజ, వంశీ తేజ, పల్లపోతు కృష్ణారావు, మందా నాగలక్ష్మి, కోట రమేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.