BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు
Date of Publish : 18 August 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మీ సేవ యాప్‌లో ఆర్టీసీ టికెట్లు.. త్వరలో అందుబాటులోకి రవాణా సేవలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
58 వీక్షణలు

తెలంగాణ ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇకపై ఆర్టీసీ బస్సు టికెట్లను ‘మీ సేవ’ యాప్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రజా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో, ఆటో, క్యాబ్‌ సేవలను కూడా ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు ఒకే యాప్‌ ద్వారా తమ ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. గమ్యస్థానానికి అనుగుణంగా బస్సు, మెట్రో, ఇతర రవాణా మార్గాలకు ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. టికెట్‌ చార్జీలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు.

ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రజా రవాణా సేవలను మరింత సులభంగా వినియోగించుకునేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.