BREAKING
thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● కొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన thumb ● రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ thumb ● ప్రాణాలను కాపాడే మహత్తర సేవ రక్తదానం thumb ● గని గుంతలో పడి వ్యక్తి మృతి
Date of Publish : 01 October 2026, 03:54 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో అక్టోబర్ 3న ఐలు 11వ జిల్లా మహాసభలు మహాసభలను జయప్రదం చేయండి

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Oct, 2026 - 03:54 PM
6 వీక్షణలు

మధిర: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలో అక్టోబర్ 3వ తేదీ శనివారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) 11వ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు దిరిశాల జగన్ మోహన్ రావు, మధిర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చావల రామరాజు తెలిపారు. స్థానిక రీక్రియేషన్ క్లబ్‌లో ఈ మహాసభలు జరగనున్నాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐలు నాయకులు, ప్రముఖ న్యాయవాదులు ఈ మహాసభలకు హాజరుకానున్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ప్రజలకు న్యాయమైన హక్కులు అందించడం, సత్వర న్యాయం సాధించడం వంటి అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు.

జూనియర్ న్యాయవాదులకు ఉపయోగపడేలా సీనియర్ న్యాయవాది కొల్లిపాక రమేష్ ఆధ్వర్యంలో ప్లీడింగ్, డ్రాఫ్టింగ్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.

ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఐలు రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కొట్ట పార్థసారథి, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు మందడపు శ్రీనివాసరావు, చందాల శైలజ, ఏడు నూతల శ్రీనివాసరావు తదితరులు హాజరుకానున్నారు.

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి, ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని నిర్వాహకులు న్యాయవాదులకు పిలుపునిచ్చారు.