BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి మూడు నెలల జైలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:32 PM
50 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మరో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని చాట్రాయి పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు నెలల పాటు జైలుకు తరలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ హెచ్చరించారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, నూజివీడు సబ్ డివిజన్ డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ పర్యవేక్షణలో, నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ సూచనలతో చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

చాట్రాయి గ్రామానికి చెందిన నందిపాము శ్రీనివాసరావు అలియాస్ సారా శ్రీను, తండ్రి వెంకటరత్నం, గతంలో గొడవలకు సంబంధించిన వ్యవహారాల నేపథ్యంలో చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో అనుమానితుల జాబితాలో ఉన్నాడు. అతను భవిష్యత్తులో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేందుకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 129(ఇ) ప్రకారం ఎం.సి. నంబర్ 131/2026, తేదీ 03-06-2026 ద్వారా 12 నెలల పాటు బైండోవర్ చేశారు. ఇందుకోసం రూ.2 లక్షల స్వీయ భద్రతా బాండ్ కూడా అమలు చేయించారు.

అయితే పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా సెప్టెంబర్ 12, 2026న చాట్రాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 111/2026, బీఎన్ఎస్ సెక్షన్లు 329(4), 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. దీంతో బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని చాట్రాయి పోలీసులు సంబంధిత మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్, తహసీల్దార్‌కు నివేదించారు.

ఈ వ్యవహారంపై అధికారులు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. అయితే అతను ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో పాటు, బాండ్‌కు సంబంధించిన ష్యూరిటీ మొత్తాన్ని చెల్లించలేనని తెలిపాడు. దీంతో మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్, తహసీల్దార్ జి. శ్వేత 2026 నవంబర్ 17న మూడు నెలల నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

**బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు**

బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు తిరిగి నేరాలకు పాల్పడినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఐ.వి. నాగేంద్ర కుమార్ హెచ్చరించారు. బాండ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, నిర్బంధం వంటి చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టాన్ని గౌరవిస్తూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.