BREAKING
thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు
Test 4
Date of Publish : 10 October 2026, 09:11 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మూడేళ్ల పొదుపుతో స్కూటీ కొనుగోలు.. మంచిర్యాల వ్యక్తి వీడియో వైరల్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
10 Oct, 2026 - 09:11 PM
50 వీక్షణలు

మంచిర్యాల: చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ మూడేళ్లలో స్కూటీ కొనుగోలు చేసిన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన జోసెఫ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.10 నాణేలను క్రమం తప్పకుండా దాచిపెట్టి, చివరకు తనకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేశారు.

ఏదైనా వస్తువు కొనాలనే లక్ష్యంతో జోసెఫ్ మూడేళ్ల క్రితం రూ.10 నాణేలను పొదుపు చేయడం ప్రారంభించారు. అలా సేకరించిన నాణేలను తీసుకుని తాజాగా బైక్ షోరూమ్‌కు వెళ్లారు.

భారీ సంఖ్యలో నాణేలను చూసిన షోరూమ్ సిబ్బంది తొలుత ఆశ్చర్యపోయారు. అనంతరం వాటిని లెక్కించడం ప్రారంభించారు. సుమారు రెండు గంటల పాటు లెక్కించిన తర్వాత మొత్తం రూ.1.23 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో జోసెఫ్‌కు స్కూటీని అందజేశారు.

చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని జోసెఫ్ చేసిన ప్రయత్నం పలువురిని ఆకట్టుకుంటోంది. ఆయన నాణేలను లెక్కిస్తున్న దృశ్యాలు, స్కూటీ కొనుగోలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.