టి.యం.యు.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంద వేణుగోపాల్ రెడ్డి నియామకం
.NTIDAY NEWS : చిట్యాల,
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం (టీ.యం.యు.ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన మంద వేణుగోపాల్ రెడ్డిని నియమించినట్లు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తెలిపారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో ఉద్యమకారులు చేసిన పోరాటం, త్యాగాలను గుర్తిస్తూ వారి కుటుంబాల సంక్షేమం, హక్కుల సాధన కోసం టీ.యం.యు.ఎస్ నిరంతరం కృషి చేస్తుందని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తెలిపారు. సంఘం ఆశయాల సాధనతో పాటు ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం మంద వేణుగోపాల్ రెడ్డి చురుకైన పాత్ర పోషిస్తారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను ఐక్యం చేసి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల గౌరవం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం టీ.యం.యు.ఎస్ మరింత బలంగా ముందుకు సాగుతుందని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీ.యం.యు.ఎస్ నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు లింగస్వామి మాదిగ, బత్తుల నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.