BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:16 am
Posted by : K MAHESH

మేడి లింగయ్యకు మందకృష్ణ మాదిగ ఘన నివాళులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:16 AM
18 వీక్షణలు

మృతి పట్ల సంతాపం.. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు

యాదాద్రి జిల్లా, రామన్నపేట: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్ రమేష్ మేడి తండ్రి మేడి లింగయ్య మృతి పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని మేడి లింగయ్య స్వగృహానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

మేడి లింగయ్య మృతి చెందిన రోజు, అనంతరం నిర్వహించిన సంతాప కార్యక్రమాలకు హాజరు కాలేకపోయిన మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో అప్పట్లో రాలేకపోయారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌కు చేరుకుని మేడి లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమేష్ మేడి, ప్రియదర్శిని తదితర కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ మేడి లింగయ్య గొప్ప సామాజికవేత్త, మానవతావాది అని పేర్కొన్నారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, సేవాభావాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ముందుకు సాగాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

మేడి లింగయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మందకృష్ణ మాదిగ పరామర్శించారు.