జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ
ఆత్రేయపురం మండలం: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో గురువారం మండలంలోని వెలుగు కార్యాలయంలో జీరో పావర్టీ మిషన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నిరుపేద కుటుంబాల ఎంపిక విధానంపై వీవో ఓబీలు, వీవోఏలకు మండల స్థాయిలో శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఎంపీడీవో పి.వి.ఆర్.కె. రాజు, ఏపీఎం ఆర్.ఎం.డి. గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీరో పావర్టీ మిషన్ లక్ష్యాలను వివరించారు. అర్హులైన నిరుపేద కుటుంబాలను పారదర్శకంగా గుర్తించి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు.
శిక్షణలో భాగంగా నిరుపేద కుటుంబాల ఎంపికకు సంబంధించిన విధివిధానాలు, అర్హత ప్రమాణాలు, గ్రామస్థాయిలో చేపట్టాల్సిన సర్వే ప్రక్రియ తదితర అంశాలపై సీసీలు సమగ్ర అవగాహన కల్పించారు. కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిశీలించి అర్హులను నిష్పక్షపాతంగా గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పైడితల్లి, రోజా, దుర్గా, సులోచనతో పాటు వెలుగు సిబ్బంది, వీవో ఓబీలు, వీవోఏలు పాల్గొన్నారు.