BREAKING
thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ thumb ● మునగపాకలో పెన్షన్ల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర
Date of Publish : 02 October 2026, 08:36 am
Posted by : ADARI RAMA PRASAD

మునగపాకలో మరిడిమాంబ అమ్మవారి పండుగ

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
02 Oct, 2026 - 08:36 AM
7 వీక్షణలు

మునగపాక, అక్టోబర్ 1: మండల కేంద్రం మునగపాకలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పెద్దలు అమ్మవారి ప్రభను దర్శించుకుని పూజలు చేశారు.

భక్తులు అమ్మవారి ప్రభను భక్తిశ్రద్ధలతో అలంకరించి గ్రామ పరిసరాల్లో ఊరేగించారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో సుఖశాంతులు, ప్రజల ఆరోగ్యం, పంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ మరిడిమాంబ అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు.

ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో దాడి మొసిలినాయుడు, దాడి శివ, దాడి శ్రీరామ్ మూర్తి, దాడి రమణబాబు, ఆదారి వెంకటరావు, గుమ్మడి అప్పారావు, కిల్లి వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, అలంక సూర్యప్రకాశరావు, మా ఇరి రాజబాబుతో పాటు పలువురు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.