12న ప్రకాశం కలెక్టరేట్ వద్ద మహా ఉద్యమం
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
12న ప్రకాశం కలెక్టరేట్ వద్ద మహా ఉద్యమం: మందకృష్ణ మాదిగ
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 12న మహా ఉద్యమం నిర్వహించనున్నట్లు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తెలిపారు.
వ్యవస్థల మందగమనాన్ని నిరసిస్తూ, కౌశిక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు 50 వేల మందితో ఉద్యమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కౌశిక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.