రాయలసీమ రైజింగ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ
నంద్యాల, అక్టోబర్ 1: రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉద్యాన పంటల అభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ‘రాయలసీమ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి ఫునియా, మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. రాయలసీమలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం, రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందించడం, వ్యవసాయ రంగ అభివృద్ధిపై దృష్టి సారించడం ర్యాలీ ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.
‘రైతు అభివృద్ధి.. రాయలసీమ ప్రగతి’ అనే నినాదంతో ట్రాక్టర్లతో ర్యాలీ కొనసాగింది. రాయలసీమలో ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించి, ప్రాంతాన్ని గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.