మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును కలిసిన హిందూ ఉత్సవ సమితి సభ్యులు
తెలంగాణ
మంచిర్యాల: మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో సమావేశమై పరస్పరం మాట్లాడుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ మర్యాదపూర్వక భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది.