రాయపట్నంలో పలు వినాయక మండపాలను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెలంగాణ
/
జగిత్యాల
ధర్మపురి:
ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు వినాయక మండపాలను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయా మండపాల్లో కొలువుదీరిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆ లంబోదరుడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.