గోపాలపూర్‌లో బతుకమ్మ నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
తెలంగాణ
/
వరంగల్
వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్‌లో ఆర్కాసాయికుంట వద్ద బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా బతుకమ్మ పండుగకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత తదితర అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమ ప్రాంగణంలో తగిన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.