దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
మంచిర్యాల: వాసుకి పరమేశ్వరి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్లను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆవిష్కరించారు.
అక్టోబర్ 11 నుంచి 21 వరకు ఆశ్వయుజ పాడ్యమి నుంచి విజయదశమి వరకు ఈ మహోత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఓబీసీ చైర్మన్ వొడ్డే రాజమౌళి, కార్పొరేటర్ జోగుల సదానందం, స్థానిక నాయకులు, వాసుకి పరమేశ్వరి సేవా సంస్థ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.