అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
మంచిర్యాల: లక్షెట్టిపేట్ మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన రాంపెల్లి రాజారాం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పందించి ఆయన వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.1 లక్ష విలువైన ఎల్‌ఓసీ (Letter of Credit)ని రాజారాం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా రాజారాం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందే సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు రాజారాం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.