BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 10 October 2026, 03:31 pm
Posted by : కూనురు మధు

కార్యకర్త కుమార్తెకు ఎమ్మెల్యే వేముల వీరేశం అండ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
10 Oct, 2026 - 03:31 PM
2 వీక్షణలు

 అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బూడిద శేఖర్ కుటుంబానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం అండగా నిలిచారు. చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డుకు చెందిన శేఖర్ కుమార్తె సాద్విక వైద్య విద్య అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని ఇచ్చిన హామీ మేరకు, ఆమె మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ ఫీజు రూ.1,20,000ను అందజేశారు. శేఖర్ మృతి అనంతరం ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న వేముల వీరేశం.. సాద్విక వైద్య విద్యకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మొదటి సంవత్సరం ఫీజును అందజేయడంతో పాటు, మిగిలిన నాలుగేళ్ల ఫీజును కూడా తానే చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సాద్వికను అభినందించిన ఎమ్మెల్యే, ఆమె బాగా చదువుకొని వైద్యురాలిగా ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తన కుమార్తె కూడా ఎంబీబీఎస్ చదువుతోందని పేర్కొంటూ, వైద్య విద్యకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా, అవసరమైన సహాయం కావాలన్నా తన కుమార్తె విన్నుత్నను సంప్రదించాలని సూచించారు. అనంతరం విన్నుత్నను సాద్వికకు పరిచయం చేశారు. సాద్విక వైద్య విద్యకు ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వేముల వీరేశానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.