BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 04:30 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ముప్పలపాడు సర్పంచ్ అభ్యర్థిగా మూరక వెంకటరెడ్డి ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
14 Nov, 2026 - 04:30 PM
24 వీక్షణలు

పార్టీ శ్రేణులతో సమావేశమైన డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్.. ఐకమత్యంతో పనిచేసి విజయానికి కృషి చేయాలని పిలుపు

కనిగిరి: కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో హెచ్‌ఎంపాడు మండల పార్టీ అధ్యక్షుడు యక్కంటి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ముప్పలపాడు పంచాయతీకి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, అభ్యర్థి ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

అనంతరం ముప్పలపాడు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మూరక వెంకటరెడ్డి పేరును డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా బాధ్యతతో పనిచేస్తూ పార్టీ విజయానికి తన వంతు కృషి చేయాలని అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో దిరిశనం పిచ్చిరెడ్డి, దిరిశనం ఆదిరెడ్డి, తంగిరాల వెంకట్‌రెడ్డి, మాదాల శ్రీను, మేకల గురుస్వామి, పందిటి మోష, గొబ్బిల్ల శ్రీనివాస్ యాదవ్, యారవ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.