ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌ను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్
అచ్యుతాపురం, సెప్టెంబర్ 30: మునగపాక హైస్కూల్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌ను అచ్యుతాపురంలోని ఎస్‌టిబీఎల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హైస్కూల్ చైర్మన్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చైర్మన్‌ను అభినందించారు. మునగపాక హైస్కూల్ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు.
పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిపారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు టెక్కలి పరశురాం, కూటమి నాయకులు దాడి ముసలి నాయుడు, బొడ్డేడ అప్పలనాయుడు, ఆడారి గణేష్ తదితరులు పాల్గొన్నారు.