BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:19 pm
Posted by : PAGADALA DEVAIAH

రోడ్డుపై జారిపడి మున్సిపల్ కార్మికురాలికి గాయాలు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
20 Nov, 2026 - 04:19 PM
70 వీక్షణలు

మురుగునీటి ప్రవాహంతో విధులు నిర్వహించడం కష్టంగా మారింది.. అధికారుల నిర్లక్ష్యంపై కార్మికుల ఆవేదన

సైదాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

సైదాబాద్‌లోని సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు ప్రమాదవశాత్తు రోడ్డుపై జారిపడి గాయపడింది. గురువారం ఉదయం సుమారు 9:15 గంటల సమయంలో కిష్టమ్మ అనే కార్మికురాలు రోడ్డు ఊడుస్తుండగా, రోడ్డుపై అధికంగా ప్రవహిస్తున్న నీటిలో జారిపడింది. ఈ ఘటనలో ఆమె ఎడమ చేయి విరిగినట్లు తెలిసింది.

వాంబే క్వార్టర్స్‌లోని గల్లీల నుంచి మురుగునీరు డ్రైనేజీ పైప్‌లైన్‌ మూతలు తొలగించడం వల్ల రోడ్డుపైకి ప్రవహిస్తోందని స్థానిక పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉండటంతో రోడ్లను శుభ్రం చేసే సమయంలో ప్రమాదాల భయం వెంటాడుతోందని చెబుతున్నారు.

గల్లీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం కారణంగా మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, ఈ సమస్యను సింగరేణి కాలనీ జీహెచ్‌ఎంసీ సూపర్‌వైజర్‌తో పాటు సంబంధిత అధికారులకు పలుమార్లు తెలియజేసినా స్పందన లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

వాంబే క్వార్టర్స్‌లో నీరు ప్రవహించే రోజుల్లో విధులు నిర్వహించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. వారంలో కనీసం ఒకరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి గల్లీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు రోడ్లు, గల్లీలను శుభ్రం చేయాలని విజ్ఞప్తి చేశారు.