BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 01:54 pm
Posted by : K MAHESH

రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా మునుగోడు కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 01:54 PM
122 వీక్షణలు

పున్న కైలాష్ వ్యాఖ్యలను ఖండించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు.. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక

మునుగోడు, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. రాజగోపాల్‌రెడ్డిపై పున్న కైలాష్ నేత చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని, ఆయనపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే రాజగోపాల్‌రెడ్డి ఆశయం: భీమనపల్లి సైదులు

మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్లి సైదులు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆలోచన, ఆశయమని తెలిపారు. అందులో భాగంగానే భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించేందుకు రాజగోపాల్‌రెడ్డి తన సొంత డబ్బులు ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి గురించి మాట్లాడే స్థాయి పున్న కైలాష్‌కు లేదని వ్యాఖ్యానించారు.

బీజేపీ నాయకులకు పదవులు ఇస్తున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను బీజేపీలోకి వెళ్లకపోయినా రెండుసార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. చండూరు మండల పార్టీ అధ్యక్షుడిగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తినే నియమించారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా మరోసారి రాజగోపాల్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

మునుగోడు అభివృద్ధి కోసం నిధులు అడగడం తప్పా?: బోయ దేవేందర్

చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే పున్న కైలాష్, కోమటిరెడ్డి సోదరులపై విమర్శలు చేస్తే నాయకుడిగా ఎదగవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి గతంలో పదేళ్లపాటు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ మునుగోడు అభివృద్ధి కోసం పోరాడారని గుర్తుచేశారు.

మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేయాలని చూస్తే ప్రజలు, కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కో నిప్పుకణికలా మారి పోరాటానికి సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరడం కూడా పార్టీ వ్యతిరేక చర్యగా భావిస్తారా అని ప్రశ్నించారు. ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే మంత్రి పదవి సంగతి పక్కనపెడితే కనీసం నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కూడా అందడం లేదని ఆయన విమర్శించారు.

నిజాలు తెలుసుకుని మాట్లాడాలి: రాందాస్ శ్రీనివాస్

మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. చండూరు, చౌటుప్పల్, మునుగోడు మండలాల్లో పార్టీ కోసం పనిచేసిన వారికే తిరిగి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని తెలిపారు. బీజేపీకి వెళ్లని, పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.

రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివినట్లు మాట్లాడటం సరికాదని విమర్శించారు. ఒక బీసీ బిడ్డగా చెబుతున్నానని, రాజగోపాల్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

సొంత నిధులతోనూ పాఠశాలల అభివృద్ధికి కృషి: బుజ్జి

నారాయణపూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బుజ్జి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి నిధులు అందకపోయినా రాజగోపాల్‌రెడ్డి తన సొంత నిధులతో సాధ్యమైనంత మేర పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన నిధులు కోరుతున్నది నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని గుర్తించాలని పేర్కొన్నారు.

మునుగోడు అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పోరాటం: మిర్యాల వెంకన్న

మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న మాట్లాడుతూ.. పున్న కైలాష్ కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి కోమటిరెడ్డి సోదరులు కారణమని పేర్కొన్నారు. చేనేత బిడ్డగా రాజగోపాల్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం పోరాడారని గుర్తుచేశారు.

నియోజకవర్గానికి నిధులు అందకపోవడంతోనే ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మునుగోడు వెనుకబాటుతనాన్ని గుర్తించి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. నిధులు ఇవ్వకపోతే ప్రజలు, కార్యకర్తలు తమ నిరసనను తెలియజేస్తారని అన్నారు.

కార్యకర్తల కష్టాలు తెలిసిన నాయకుడు రాజగోపాల్‌రెడ్డి: పూల వెంకటయ్య

నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి పలుమార్లు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచనలు చేశారని తెలిపారు. 2015లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ కోసం ముందుకు వచ్చి జెండా పట్టుకుని పోరాడిన నాయకుడని పేర్కొన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు. మునుగోడులో సాగునీరు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధి కోసం రాజగోపాల్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న లక్ష్యంతోనూ రాజగోపాల్‌రెడ్డి పనిచేస్తున్నారని, తామంతా ఆయన వెంట ఉంటామని స్పష్టం చేశారు.

రాజగోపాల్‌రెడ్డిని బలహీనపరిచే ప్రయత్నాలు మానుకోవాలి: పల్లె వెంకన్న గౌడ్

చండూరు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పల్లె వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా రాజగోపాల్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాజగోపాల్‌రెడ్డి కూడా కృషి చేశారని, ఆయనను బలహీనపరిచే ప్రయత్నాల్లో భాగంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నాయకులపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.

పార్టీ బలోపేతానికి నాయకులు పనిచేయాలి: వెన్నంనేని రవీందర్ రావు

నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నంనేని రవీందర్ రావు మాట్లాడుతూ.. మునుగోడు ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడిగా రాజగోపాల్‌రెడ్డిని తమ నాయకులు భావిస్తున్నారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు పార్టీని బలోపేతం చేయడానికా, లేక ముఖ్యమంత్రి తరఫున మాట్లాడటానికా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేశారని పేర్కొన్నారు.

ఈ ప్రెస్‌మీట్‌లో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల స్థాయి నాయకులు పాల్గొని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి తమ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.