BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నాగారం మున్సిపల్ కార్మికుల నూతన కమిటీ ఎన్నిక కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం..

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 06:49 PM
21 వీక్షణలు

చలో ఢిల్లీని జయప్రదం చేయాలి కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి.. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి మల్కాజిగిరి, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక హక్కుల సాధన కోసం నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర మండలం ఘట్కేసర్ సర్కిల్-06 నాగారం డివిజన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం కరీంగూడ పాత గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బంగారు నర్సింగరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ వారి సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమను గుర్తించి వారికి న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ నెలకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. జాతీయ పండుగల సెలవులను తప్పనిసరిగా అమలు చేయాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని, అంత్యక్రియల ఖర్చుల కింద ప్రస్తుతం అందిస్తున్న రూ.10 వేల మొత్తాన్ని రూ.30 వేలకు పెంచాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాగారం డివిజన్ నూతన కమిటీ ఎన్నిక అనంతరం నాగారం డివిజన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బంగారు నర్సింగరావు, అధ్యక్షుడిగా చింతల యాదయ్య, ఉపాధ్యక్షులుగా గ్యార మైసయ్య, చీర ఐలయ్య, కార్యదర్శిగా సంధ్య జాన్ మోష, కోశాధికారిగా కట్ట ప్రశాంత్ ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా కర్రెల వెంకటేష్, చీమల భాను ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా మొరుగు మణెమ్మ, చిందం బాలమ్మ బాధ్యతలు చేపట్టారు. కమిటీ సభ్యులుగా లలిత, నీరజ, పెంటమ్మ, మహంకాలమ్మ, భాగ్య, పోచయ్య, బాబు, బజారన్న, సుశీల తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సమావేశంలో గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి, దాయరా ప్రాంతాలకు చెందిన మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ಕಾರ್ಮಿಕుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం సాధ్యమని, హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని సమావేశం పిలుపునిచ్చింది.