BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 27 June 2026, 09:27 pm
Posted by : కూనురు మధు

నిద్రమత్తు తెచ్చిన ముప్పు : తిరుమలగిరిలో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ !

తెలంగాణ
/ తెలంగాణ / యాదాద్రి భువనగిరి
27 Jun, 2026 - 09:27 PM
205 వీక్షణలు

నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ అదుపు తప్పడంతో లారీ ఓ ఇంటిపైకి దూసుకెళ్లిన ఘటన తిరుమలగిరి మండలంలో శనివారం చోటుచేసుకుంది. వలిగొండ–తొర్రూర్ 960(పీ) జాతీయ రహదారిపై జలాల్‌పురం సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద తమిళనాడు రాష్ట్రానికి చెందిన TN 20 BS 0268 లారీ అతివేగంగా అదుపు తప్పి డబ్బా వెంకన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. అయితే ఇంటి గోడలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు కిరాణా సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో తనకు సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వెంకన్న తెలిపారు.

ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు.