BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 23 September 2026, 07:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 07:09 AM
61 వీక్షణలు

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్) అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో కేసు నమోదైంది. అవినీతి నిరోధక చట్టం, 1988లో 2018లో చేసిన సవరణల ప్రకారం సెక్షన్ 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

నోరి లక్ష్మీ భాస్కర్‌ సర్వీసులో ఉండగా తనకు తెలిసిన చట్టబద్ధమైన ఆదాయ వనరులకు మించి అవినీతి, అనుమానాస్పద మార్గాల్లో ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు సంబంధించిన మరో ఏడు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.

సోదాల్లో పలు స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక నాలుగు పడకగదుల ఫ్లాట్, కూకట్‌పల్లిలో రెండు మూడు పడకగదుల ఫ్లాట్లు, మణికొండ, పేటబషీరాబాద్, కూకట్‌పల్లిలో ఐదు రెండు పడకగదుల ఫ్లాట్లకు సంబంధించిన వివరాలు గుర్తించారు. యాదాద్రి, నందిగామ, షమీర్‌పేట ప్రాంతాల్లో నాలుగు ఖాళీ స్థలాలు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో 800 చదరపు గజాల ఖాళీ స్థలానికి సంబంధించిన పత్రాలు కూడా లభించినట్లు అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షలు, పోస్టాఫీసులో రూ.12 లక్షల డిపాజిట్లు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో రూ.1.50 లక్షల పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. సోదాల్లో రూ.35 లక్షల నగదు, మ్యూచువల్ ఫండ్లలో రూ.29.55 లక్షల పెట్టుబడులకు సంబంధించిన వివరాలు, సుమారు 517.8 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

వాహనాల విషయానికి వస్తే జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ సహా నాలుగు చక్రాల వాహనాలు, రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులు, నగదు, పెట్టుబడులు, ఇతర విలువైన వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.6.13 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. అయితే స్థిర, చరాస్తుల వాస్తవ మార్కెట్ విలువ పత్రాల్లో నమోదైన విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

అదనంగా డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) ముందు వివాదంలో ఉన్న ఓ ఫ్లాట్ కొనుగోలుకు రూ.1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వివిధ వ్యక్తులకు చేతివడ్డీపై సుమారు రూ.1.33 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు కూడా సమాచారం వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

సోదాల్లో గుర్తించిన ఆస్తులు, పెట్టుబడులు, నగదు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరింత లోతుగా అధికారులు పరిశీలిస్తున్నారు. అదనపు ఆస్తుల వివరాలపై ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, కేసు దర్యాప్తులో ఉందని అధికారులు తెలిపారు.