BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 13 May 2026, 05:07 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 May, 2026 - 05:07 PM
168 వీక్షణలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

​వైభవంగా బొల్లారం పోచయ్య కుమార్తె వివాహం

​హాజరైన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు

​ధర్మపురి, మే 13

ధర్మపురి క్షేత్రంలో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ధర్మపురి దేవస్థాన కమిటీ సభ్యులు బొల్లారం పోచయ్య కుమార్తె శ్వేత, వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామానికి చెందిన సైదం సత్తయ్య కుమారుడు నవీన్ ల వివాహ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

​ఈ వేడుకలో మంత్రి అడ్లూరి పాల్గొని నూతన వధూవరులపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన నూతన దంపతులు నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అంతకుముందు మంత్రికి పోచయ్య కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

​హాజరైన ప్రముఖులు:

​మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. వివాహ వేడుకకు వచ్చిన అతిథులతో కల్యాణ మండపం సందడిగా మారింది.