BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 08:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరులో ఘనంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 08:04 PM
28 వీక్షణలు

బాలలను పనిపిల్లలుగా మార్చొద్దు.. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి – ఏఐవైఎఫ్ నాయకులు ఏలూరు: నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, బడి ఈడు పిల్లలను పనిపిల్లలుగా మార్చకుండా ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కూరెళ్ల వరప్రసాద్, సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు కోరారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో 21వ డివిజన్ పరిధిలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల వద్ద జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కూరెళ్ల వరప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని బాలబాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలే దేశ సంపదని, వారి చిరునవ్వుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, భద్రత కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని అన్నారు. నేటికీ ఎంతోమంది పిల్లలు పేదరికం, బాల కార్మికత్వం, విద్యకు దూరం కావడం, పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలల చేతుల్లో పుస్తకాలు ఉండాలి కానీ పనిముట్లు కాదని స్పష్టం చేశారు. చిన్నారుల జీవితాల్లో పేదరికం చీకట్లు తొలగించి విద్యావెలుగులు నింపేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ను ఆయన పిల్లలపై చూపిన ప్రేమ, ఆప్యాయతలకు గుర్తుగా 1964 నుంచి జాతీయ బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే నేటికీ దేశంలో బాలల హక్కులు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం బాలలకు విద్య, జీవించే హక్కు, ఆరోగ్యంగా ఎదిగే హక్కు, బాల కార్మికత్వం నుంచి రక్షణ, దోపిడీ, వివక్ష నుంచి విముక్తి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కులు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21-ఏ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య హక్కు కల్పించబడిందని గుర్తుచేశారు. ఈ హక్కులపై బాలలకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేయాలని, చిన్నతనం నుంచే మూఢనమ్మకాలకు దూరంగా ఉండేలా మంచి వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. బాలల హక్కుల సాధన కోసం యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐదు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పలకలు, బలపాలు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యవర్గ సభ్యురాలు గొర్లి స్వాతి, ఏలూరు ఏరియా కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, 21వ డివిజన్ నాయకులు తెర్లాపు శ్రీను, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవాని, ఉప్పులూరి జ్యోతి, కొల్లూరి రేఖ తదితరులు పాల్గొన్నారు.