BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 02:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 02:15 PM
60 వీక్షణలు

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి – ప్రధానోపాధ్యాయులు కొర్రపాటి యోహాను 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడం, పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని విస్తరించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొర్రపాటి యోహాను రిబ్బన్ కట్ చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ అంశాలకు సంబంధించిన విజ్ఞానదాయకమైన పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని వివరించారు. మంచి పుస్తకం మంచి మిత్రునితో సమానమని, మనిషికి జీవితాంతం ఉపయోగపడే విజ్ఞానాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు అన్ని వయస్సుల వారు తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించే వివిధ రకాల పుస్తకాలను పరిచయం చేసి, వాటిని చదివించారు. పుస్తకాల ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థుల్లో చదివే ఆసక్తిని పెంచేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎస్. లీలా శంకర్, శిరిడి సాయిబాబా కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, గుంత హనుమయ్య, పలువురు గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.