BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 09 October 2026, 09:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరి పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు నీమాస్త్రం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 09:00 PM
14 వీక్షణలు

తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా: వరి పంటలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్నచిన్న పురుగుల నివారణకు ప్రకృతి ఆధారిత ద్రావణమైన నీమాస్త్రాన్ని తయారు చేశారు. విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో ఐసీఆర్‌పీ విస్సంపల్లి విజయలక్ష్మి ఏ గ్రేడ్ వరి పంటలో ఏటీఎం నమూనా ద్వారా పిచికారీ చేసేందుకు నీమాస్త్రాన్ని సిద్ధం చేశారు.

నీమాస్త్రం తయారీకి కావలసిన పదార్థాలు

నీమాస్త్రం తయారీకి 10 కిలోల బాగా దంచిన వేపాకుల ముద్ద, 200 లీటర్ల నీరు, 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 2 కిలోల తాజా ఆవు పేడ అవసరం.

తయారీ విధానం

200 లీటర్ల నీరు ఉన్న డ్రమ్‌లో వేపాకుల ముద్ద, ఆవు మూత్రం, ఆవు పేడ వేసి బాగా కలపాలి. అనంతరం గోనె సంచితో కప్పి 48 గంటల పాటు పులియబెట్టాలి. రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం రెండు నిమిషాల పాటు కుడివైపు కలియబెట్టాలి. 48 గంటల తర్వాత పలుచటి వస్త్రంతో ద్రావణాన్ని వడకట్టాలి.

పిచికారీ చేసే విధానం

తయారైన నీమాస్త్రాన్ని నీటితో కలపకుండా నేరుగా పంటపై సాయంత్రం వేళ పిచికారీ చేయాలని సూచించారు. ఒక ఎకరా వరి పంటకు 200 లీటర్ల నీమాస్త్రం అవసరమవుతుంది. తయారు చేసిన ద్రావణాన్ని 30 రోజుల్లోపు వినియోగించడం మంచిదని తెలిపారు.

నీమాస్త్రం ఉపయోగాలు

నీమాస్త్రం వరి పంటలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్నచిన్న పురుగుల నియంత్రణకు ఉపయోగపడుతుంది. పురుగుల గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడాన్ని అడ్డుకోవడంలోనూ సహాయపడుతుందని పేర్కొన్నారు. ప్రకృతి ఆధారిత పద్ధతుల ద్వారా పంటలపై పురుగుల ఉధృతిని తగ్గించేందుకు రైతులు ఇటువంటి విధానాలను అనుసరించవచ్చు.