చరిత్ర సృష్టించిన నీరూ ధండా..
జాతీయం
జాతీయం
ట్రాప్ షూటింగ్‌లో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ నీరూ ధండా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో 26 ఏళ్ల నీరూ ధండా స్వర్ణ పతకం సాధించారు.
ఆసియా క్రీడల మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత షూటర్‌గా నీరూ ధండా రికార్డు నెలకొల్పారు.
అదే రోజు అషిమా అహ్లావత్, మనీషా కీర్‌తో కలిసి మహిళల ట్రాప్ టీమ్ విభాగంలోనూ నీరూ ధండా రజత పతకం సాధించారు. దీంతో ఒకే రోజు రెండు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు.
నీరూ ధండా ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ జట్టుకు మరో పతకం దక్కింది.A