BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 11:30 am
Posted by : SIVA RAJ

గుంటూరు మిర్చి యార్డుకు ముందుగానే కొత్త మిర్చి రాక

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
17 Nov, 2026 - 11:30 AM
18 వీక్షణలు

ఒక్కరోజే 12 వేల బస్తాల కొత్త పంట రాక.. క్వింటాల్‌కు రూ.23 వేల వరకు ధర

గుంటూరు | ఎన్ టుడే న్యూస్

గుంటూరు మిర్చి యార్డుకు కొత్త మిర్చి పంట రాక ప్రారంభమైంది. సాధారణంగా నవంబర్ చివరి వారంలో మార్కెట్‌కు చేరుకునే కొత్త పంట ఈసారి ముందుగానే యార్డుకు వస్తుండటంతో వ్యాపార వర్గాల్లో సందడి నెలకొంది. కొత్త మిర్చి రాకతో మార్కెట్‌లో కొనుగోళ్లు, విక్రయాలు ఊపందుకుంటున్నాయి.

సోమవారం ఒక్కరోజే సుమారు 12 వేల బస్తాల కొత్త మిర్చి యార్డుకు చేరినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. అన్ని రకాల మిర్చి కలిపి మొత్తం 29,109 బస్తాల సరుకు మార్కెట్‌కు వచ్చినట్లు తెలిపారు. సాధారణం కంటే ముందుగానే కొత్త పంట మార్కెట్‌లోకి రావడం ఈసారి ప్రత్యేకతగా మారింది.

ధరల విషయానికి వస్తే.. 1081 రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.23 వేల వరకు పలికింది. ఇతర రకాల మిర్చి ధరలు నాణ్యత, రకాన్ని బట్టి క్వింటాల్‌కు రూ.20,800 నుంచి రూ.22 వేల మధ్య కొనసాగుతున్నాయి.

కొత్త పంట ముందుగానే యార్డుకు చేరుతుండటంతో రైతులు తమ దిగుబడులను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు మిర్చి వ్యాపార కార్యకలాపాలు కూడా క్రమంగా ఊపందుకుంటున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్‌కు వచ్చే పంట పరిమాణం, నాణ్యతను బట్టి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.