పిట్టంపల్లిలో కాంగ్రెస్ నూతన కమిటీ ఏర్పాటు
గ్రామ శాఖ అధ్యక్షుడిగా మేడి విష్ణువర్ధన్ ఎన్నిక
చిట్యాల, ఎన్‌టుడే న్యూస్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
గ్రామ శాఖ అధ్యక్షుడిగా మేడి విష్ణువర్ధన్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జక్కల రాజు, నారగోని లింగస్వామి, అందె శేఖర్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా మెట్టు వెంకటేశ్‌ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు గ్రామంలోని స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
నూతన కమిటీ ఎన్నికపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి, కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.