BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 12:55 pm
Posted by : SEETHA KIRAN KUMAR

AHDS వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు కొత్త ఆశలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
20 Nov, 2026 - 12:55 PM
21 వీక్షణలు

టిరాట్రికాల్ మందు ధర తగ్గింపునకు డాక్టర్ శివరంజని సంతోష్ కృషి

  • గతంలో ఒక్కో చిన్నారికి ఏడాది చికిత్సకు రూ.9 కోట్ల వరకు ఖర్చు

  • నెదర్లాండ్స్ ఫార్మసీ సహకారంతో ఇప్పుడు రూ.2.5 లక్షలకే మందు

  • ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు అవసరమైన మందులు ఉచితంగా అందజేత

హైదరాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): అరుదైన జన్యుపరమైన వ్యాధి అలన్‌-హెర్ండన్‌-డడ్లీ సిండ్రోమ్‌ (AHDS)తో బాధపడుతున్న ఏడుగురు చిన్నారుల కుటుంబాలకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే టిరాట్రికాల్ (Tiratricol) ఔషధం ధరను భారీగా తగ్గించేందుకు డాక్టర్ శివరంజని సంతోష్ చేసిన కృషి ఫలితంగా చిన్నారులకు మెరుగైన చికిత్స అందే అవకాశం ఏర్పడింది.

గతంలో ఈ వ్యాధితో బాధపడుతున్న ఒక్కో చిన్నారికి ఏడాది పాటు చికిత్స అందించేందుకు సుమారు రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యేది. అంతటి భారీ వ్యయంతో కూడిన మందులను కొనుగోలు చేయడం బాధిత కుటుంబాలకు తీవ్ర ఆర్థిక భారంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ శివరంజని సంతోష్ టిరాట్రికాల్ ఔషధం ధర తగ్గింపునకు కృషి చేశారు.

నెదర్లాండ్స్‌లోని ఒక ఫార్మసీ సహకారంతో గతంలో కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఔషధాన్ని ప్రస్తుతం సుమారు రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో చికిత్స ఖర్చు గణనీయంగా తగ్గింది.

మరోవైపు, AHDSతో బాధపడుతున్న ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు అవసరమైన టిరాట్రికాల్ మందులను ఉచితంగా అందజేయడం విశేషం. ఈ చర్యతో ఖరీదైన చికిత్సను భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారుల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

అరుదైన వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు అవసరమైన మందులు అందుబాటులోకి రావడం వారి కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది.