పల్లె పండుగ 3.0తో గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపు!
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.11,085 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా 15,500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంది.
గ్రామాల్లో అంతర్గత రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణంతో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.