BREAKING
thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
Test 4
Date of Publish : 16 November 2026, 05:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొణిజర్లలో వైసీపీకి కొత్త ఊపు.. సొంత గూటికి చేరిన యువజన నాయకుడు కన్నా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 05:25 PM
1 వీక్షణలు

పంచాయతీ ఎన్నికల వేళ మన్నేపల్లి వెంకటకృష్ణ రీఎంట్రీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం 

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువజన నాయకుడు మన్నేపల్లి వెంకటకృష్ణ అలియాస్ కన్నా తిరిగి తన సొంత పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ పార్టీ పెద్దల సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొని వైసీపీలోకి పునఃప్రవేశం చేశారు. యువజన నాయకుడిగా గ్రామంలో చురుకైన పాత్ర పోషిస్తున్న కన్నాకు బలహీన వర్గాల్లో మంచి గుర్తింపు ఉందని స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. గతంలో పార్టీకి దూరమైన ఆయన తిరిగి వైసీపీలో చేరడం గ్రామ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కన్నా తిరిగి పార్టీలోకి రావడం కొణిజర్లలో వైసీపీకి బలాన్ని చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో ఈ చేరికతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.