BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 06:10 pm
Posted by : K MAHESH

గంగారం మండల ఉద్యోగులకు నీతి ఆయోగ్ ప్రశంసా పత్రాలు

తెలంగాణ
/ వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 06:10 PM
27 వీక్షణలు

మంత్రి సీతక్క చేతుల మీదుగా ఉద్యోగులకు సత్కారం

కొత్తగూడ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7:

ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గంగారం మండల అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క ప్రశంసా పత్రాలను అందజేశారు. శనివారం కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆమె ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు.

సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నీతి ఆయోగ్ కార్యక్రమాలు

2024 నుంచి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో గంగారం మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి రంగాల్లో సేవలను విస్తరించి, మండలాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. ఈ దిశగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు.

సంపూర్ణత అభియాన్‌లో ప్రతిభ

జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2024 వరకు నిర్వహించిన జిల్లా ఆస్పిరేషన్ ప్రోగ్రామ్‌లో భాగమైన ‘సంపూర్ణత అభియాన్’ కార్యక్రమంలో గంగారం మండల అధికారులు, ఉద్యోగులు చురుకుగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వారి సేవలను గుర్తించిన మంత్రి సీతక్క ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.

ప్రశంసా పత్రాలు అందుకున్నవారు

ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ సంగేపు సాయినాథ్, నర్సింగ్ ఆఫీసర్లు కొటెం లక్ష్మి, రాజమణి, ఎంపీహెచ్‌ఈవోలు నిర్మల, స్వరూప, సమ్మక్క, ఆశా వర్కర్లు సుజాత, నాగమణి, మంజుల, స్వరూప ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

డీఆర్డీఏ నుంచి సీసీ శ్రీరాములు, ఇప్పపువ్వు లడ్డూల తయారీదారులు ఈశ్వరమ్మ, సుభద్ర, స్వరూప, పాపక్క, సమ్మక్క, వీవీఏలు రమేష్, సువార్తలను అభినందించారు.

అంగన్వాడీ శాఖ నుంచి సూపర్వైజర్ మంజుల, అంగన్వాడీ టీచర్లు పద్మ, విజయ, నీల, సుశీల, సుమలత ప్రశంసా పత్రాలు అందుకున్నారు. జిల్లా ప్రజా పరిషత్‌కు చెందిన కృష్ణ, రాంబాబు, నరేష్‌లను కూడా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి దేశిరాం, గూడూరు సీడీపీఓ నీలిమ, గంగారం ఎంపీడీవో వైష్ణవి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.