NMMS దరఖాస్తులను అక్టోబర్ 16లోగా అందజేయాలి
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
NMMS దరఖాస్తులను అక్టోబర్ 16లోగా అందజేయాలి: డీఈఓ సుబ్బారావు
మార్కాపురం జిల్లా: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అక్టోబర్ 16వ తేదీలోగా తమ దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో అందజేయాలని డీఈఓ సుబ్బారావు సూచించారు.
దరఖాస్తుతో పాటు హెచ్‌ఎం కవరింగ్ లెటర్, చలానా, నామినల్ రోల్, 7వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు ప్రతిని సమర్పించాలని తెలిపారు.
దరఖాస్తుల సమర్పణకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా నోడల్ అధికారి ఫోన్ నంబర్ 9490688595ను సంప్రదించాలని డీఈఓ సుబ్బారావు సూచించారు.