BREAKING
thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
Date of Publish : 07 October 2026, 01:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు 16,600 కిలోమీటర్ల ప్రయాణం..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Oct, 2026 - 01:50 PM
9 వీక్షణలు

పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు  16,600 కిలోమీటర్ల ప్రయాణం.. చిన్న పక్షి నేర్పే గొప్ప పాఠం

ఆరు అంగుళాల పరిమాణం ఉండే చిన్న పక్షి వేల కిలోమీటర్ల దూరం వలస వెళ్లడం ఆశ్చర్యమే. ప్రతి సంవత్సరం సంతానోత్పత్తి కోసం సుదూర ప్రయాణం చేసే ఈ పక్షులు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో అడ్డంకులను అధిగమిస్తాయి.

అర్జెంటీనా నుంచి ప్రారంభమయ్యే వాటి ప్రయాణం వేల కిలోమీటర్లు సాగుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కువ భాగం సముద్రం మీదుగానే ఉంటుంది. అలసట వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు తమతో పాటు తీసుకెళ్లే చిన్న పుల్లను నీటిపై ఉంచుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాయని చెబుతారు. ఆ తర్వాత మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి.

తిరుగు ప్రయాణంలోనూ అదే పట్టుదలతో ముందుకు సాగుతూ తమ పిల్లలతో కలిసి సుదూర ప్రయాణాన్ని పూర్తి చేస్తాయి. ఇంత చిన్న పక్షి ఇంతటి సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించగలగడం వెనుక ఉన్నది దాని సహజసిద్ధమైన సామర్థ్యం, దిశానిర్దేశం, పట్టుదల.

ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎంతో గొప్పది.

చిన్న పక్షికే తన ప్రయాణంపై అంత నమ్మకం ఉంటే.. అన్ని అవయవాలతో పాటు ఆలోచించే శక్తి, అపారమైన మేధస్సు ఉన్న మనిషికి తనపై తనకు ఇంకెంత నమ్మకం ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉండాలి.

ఒక్కసారి ఓడిపోయామని ప్రయత్నాన్ని ఆపేయకూడదు. పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేచి ముందుకు సాగాలి. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు.

మనపై మనకు నమ్మకం ఉంటే.. ఎంత దూరమైనా ప్రయాణించగలం. ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించగలం.