BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 06:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుడివాడలో మున్సిపల్ ఎన్నికలకు అధికారుల కసరత్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:56 PM
1 వీక్షణలు

గుడివాడ పురపాలక సంఘ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్డీవో బాలసుబ్రమణ్యం అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. గుడివాడ పురపాలక సంఘ పరిధిలోని 48 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లను మున్సిపల్ కార్యాలయంలో స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయగా, చైర్మన్ అభ్యర్థుల నామినేషన్ల కోసం ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 34 ప్రాంతాల్లో 134 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో బాలసుబ్రమణ్యం సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.