ఘనంగా ప్రారంభమైన ఒంగోలు ఉత్సవాలు
ఒంగోలు: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఒంగోలు ఉత్సవాలు మినీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
చిన్నారులు దేశభక్తి గీతాలతో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఒంగోలు ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రాత్రి 11 గంటల వరకు ఉత్సవాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజలను అలరించే పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.