BREAKING
thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 12:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పల్నాడు పోలీసులకు ఓపీఎస్ వర్తింపు.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 12:28 PM
21 వీక్షణలు

జీఓ 158తో సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మార్పు

పల్నాడు జిల్లా: ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.158 ప్రకారం సీపీఎస్ (CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS) పరిధిలోకి మార్పు చేయడంపై పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు గతంలో ఏపీ ఎస్పీ నుంచి ఏఆర్ విభాగానికి ఎంపికై, అనంతరం సివిల్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.158 ద్వారా తమకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వెంకటేశ్వరరావు, చిలకలూరిపేట టౌన్‌కు చెందిన సాయి రాము, ఈపూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆరిఫ్, కళ్యాణ్, సాగర్, వినుకొండ రూరల్ సర్కిల్ కార్యాలయానికి చెందిన రాజా తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు కూడా పాల్గొన్నారు.