BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 28 March 2026, 05:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెదపాడు మండలంలో దొంగతనాలపై పోలీసుల అలర్ట్ ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Mar, 2026 - 05:47 AM
204 వీక్షణలు

పెదపాడు మండలంలో దొంగతనాలపై పోలీసుల అలర్ట్ ప్రచారం

పెదపాడు మండలంలో దొంగతనాలపై పోలీసులు అలర్ట్ ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు ఇతర ఆస్తి నేరాలను అరికట్టేందుకు పెదపాడు పోలీసులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు వీధుల్లో ఆటో అనౌన్స్‌మెంట్ ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అలాగే పొరుగు వారి సహకారం తీసుకోవాలని సూచించారు ఎల్హెచ్ఎంఎస్ (లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఎస్ఐ తెలిపారు ప్రతి ఇంటి యజమాని వ్యాపారస్తులు తమ ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగేవారి పట్ల అప్రమత్తంగా ఉండి వారి వివరాలు తెలుసుకోవాలని సూచించారు రాత్రి సమయాల్లో కిటికీల వద్ద పడుకునే వారు జాగ్రత్తగా ఉండాలని అలాగే ప్రయాణాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినా లేదా అపరిచితులు కనిపించినా వెంటనే డయల్ 112 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్ 9440796637 కు సమాచారం అందించాలని కోరారు ఈ సందర్భంగా ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటేనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని పోలీసుల గస్తీతో పాటు ప్రజలు కూడా స్వీయ రక్షణ చర్యలు పాటించాలని సూచించారు ఈ ఆటో అనౌన్స్‌మెంట్ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజల్లో కూడా భద్రతపై అవగాహన పెరుగుతుందని తెలిపారు