BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 05 July 2026, 11:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
132 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత  జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, రావూరి భరద్వాజ తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఆయన 37 కథా సంపుటాలు, 17 నవలలు, ఆరు బాలల మినీ నవలలు, ఐదు బాలల కథా సంపుటాలు, మూడు వ్యాస, ఆత్మకథ సంపుటాలు, ఎనిమిది నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించి తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

బాలసాహిత్య రంగంలోనూ ఆయన విశేష కృషి చేశారని, 2012లో ఆయన రచించిన  నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించడం తెలుగు సాహిత్యానికి గర్వకారణమని తెలిపారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ, కళాప్రపూర్ణ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో పాటు అనేక సన్మానాలు అందుకున్నారని గుర్తు చేశారు.

తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహిత్య ప్రక్రియలకు శ్రీకారం చుట్టిన మహోన్నత రచయితగా రావూరి భరద్వాజను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.