BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 04:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగోలులో ఘనంగా శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, 108 దీపాలతో దీపోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:12 PM
123 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 23: తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగోలు గ్రామంలో సోమవారం శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి 108 దీపాలతో దీపోత్సవం చేపట్టారు. ముందుగా ‘ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి’ నామస్మరణతో షిర్డీ సాయిబాబా మందిరం చుట్టూ పల్లకిసేవ నిర్వహించారు. అనంతరం మహిళా కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో సాయిబాబా చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయినామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో వివిధ స్వాముల మాలధారులకు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కమిటీ సభ్యులు సుగ్గల హనుమంతురావు, పారేపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. గ్రామంలో జరిగిన ఈ వేడుకలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.