BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 24 June 2026, 04:35 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
24 Jun, 2026 - 04:35 PM
106 వీక్షణలు

నరసరావుపేట / చిలకలూరిపేట | ntodaynews.com

పల్నాడు జిల్లాలో డ్రగ్స్ అక్రమ రవాణాపై చిలకలూరిపేట పోలీసులు చర్యలు చేపట్టి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిషేధిత మత్తు పదార్థమైన MDMA డ్రగ్స్‌ను తరలిస్తున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగళూరు నుంచి చిలకలూరిపేట ప్రాంతానికి డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుంచి నిషేధిత MDMA మత్తు పదార్థం లభ్యమైంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నరసరావుపేటకు చెందిన బొందిలి సింగ్‌ను గుర్తించిన పోలీసులు, చిలకలూరిపేటకు చెందిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 8 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో నిందితులు మత్తు పదార్థాలకు బానిసలై డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అరెస్ట్ చేసిన నిందితులను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ అక్రమ రవాణా మరియు వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.