BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 24 June 2026, 04:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jun, 2026 - 04:25 PM
113 వీక్షణలు

అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా ఐదేళ్లలోపు వయస్సు గల 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.

కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.31 లక్షల మంది సిబ్బందిని సేవలకు సిద్ధం చేశారు.

చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, అవసరమైన 68.67 లక్షల వ్యాక్సిన్ మోతాదులను ఇప్పటికే జిల్లాలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువెళ్లి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేసింది.