BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 24 June 2026, 04:32 pm
Posted by : V శ్రీనివాస్

ప్రజాపాలనకు ప్రత్యక్ష నిదర్శనం 'ఇందిరమ్మ ఇళ్లు': మేయర్ దర్ని మధుకర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 04:32 PM
228 వీక్షణలు

​తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్లు' పథకం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలవుతోంది. ఇందులో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్‌లో లబ్ధిదారులైన కటకం రజిత-సత్యనారాయణ దంపతులు నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల నగర మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సొంతింటి కలను నెరవేర్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విచ్చేసిన మేయర్ గారిని లబ్ధిదారులు మర్యాదపూర్వకంగా శాలువాతో ఘనంగా సన్మానించారు.

​ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు ఎంత వేగంగా చేరుతాయో చెప్పడానికి పూర్తి కావస్తున్న ఈ ఇందిరమ్మ గృహాలే ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి సహకారం, అండదండలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ వార్డు అధ్యక్షులు గోపతి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు