BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 29 August 2026, 05:52 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

పల్నాడు: కోచింగ్ క్యాంపును పరిశీలించిన పూర్వ విద్యార్థులు

క్రీడలు క్రీడలు
29 Aug, 2026 - 05:52 PM
75 వీక్షణలు

పల్నాడు: కోచింగ్ క్యాంపును పరిశీలించిన పూర్వ విద్యార్థులు

పల్నాడు జిల్లా మండల కేంద్రమైన రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ది.29.08.2026న స్కూల్ ప్లే గ్రౌండ్ లో  ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ లో ఎంపికైన క్రీడాకారులకు నిర్వహిస్తున్న కోచింగ్ క్యాంప్ ను పరిశీలించి క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న పూర్వ విద్యార్ధుల సంఘం నాయకులు పిడెం హుస్సేన్, పంబా వెంకట్, పడాల శివశంకర్ రెడ్డి.అనంతరం  స్కూల్ లో ఇటీవల జరిగిన ఎస్సెన్ మెంట్ 1 పరీక్షలో పదవ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో వారికి వచ్చిన మార్కులను పరిశీలించి,విద్యలో రాణించేందుకు, సబ్జెక్టుల్లో మార్కులు పెరుగుదలపై అవగాహన కలిగించడం జరిగింది.స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్ధులు తరపున స్కూల్ కు అవసరమైన ఫ్యాన్లు, రిపేర్ లో బెంచీలకు మరమ్మత్తులు చేయించడం, కొన్ని కొత్త బెంచీలు ఏర్పాటు చేయడం, స్కూల్ ప్రక్కన అపరిశుభ్రంగా ఉన్న ఆర్&బి స్ధలమును గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్ధుల సహకారంతో ప్లేగ్రౌండ్ గా మార్చటం జరిగింది. ప్రతి సంవత్సరం పదవ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతోపాటు 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుంది.ఈ సంవత్సరం పదవ తరగతిలో 590కు మార్కులు సాధించాలని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్ధుల సంఘం నాయకులు టార్గెట్ ఇవ్వడం జరిగింది.దానికీ ఉపాధ్యాయులు, విద్యార్థులు అంగీకరించారు.స్కూల్ లో నెలకోసారి జరిగే పరీక్షలో వచ్చే మార్కులను పరిశీలించి, దానికనుగుణంగా విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను బట్టి,ఏ సబ్జెక్టులో మార్కులు తగ్గాయో,ఆ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి,ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరిగే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరడం జరిగింది.ప్రతి సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించటానికి ఉపాధ్యాయులు కృషి చేస్తే, స్కూల్ అభివృద్ధికి, విద్యార్థులకు కావలసిన మెటీరియల్స్ సమకూరుస్తామని పూర్వ విద్యార్ధుల సంఘం తరపున హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం సుభానీ , వ్యాయామ ఉపాధ్యాయులు సైదయ్య  ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు.