BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 12 July 2026, 10:04 am
Posted by : కూనురు మధు

రాష్ట్ర హాకీ ఛాంపియన్‌గా నల్లగొండ జిల్లా జట్టు!

క్రీడలు క్రీడలు
12 Jul, 2026 - 10:04 AM
137 వీక్షణలు

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్‌లో నల్లగొండ జిల్లా యువ హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్‌లో నల్లగొండ జట్టు 2–0 స్కోరుతో హైదరాబాద్‌ను మట్టికరిపించి ట్రోఫీని కైవసం చేసుకుంది. సెమీస్‌లో నిజామాబాద్‌పై 5–0తో ఘన విజయం సాధించింది. టోర్నీ పొడవునా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన నల్లగొండ జట్టు  వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జట్లపై వరుస విజయాలు సాధించింది. ముఖ్యంగా ఖమ్మం జట్టుపై 10–0 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.bవిజేతగా నిలిచిన నల్లగొండ జట్టుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు జితేందర్ రెడ్డి చేతుల మీదుగా ట్రోఫీని అందజేశారు. ​ఈ ఘన విజయంపై నల్లగొండ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.డి. ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేశారు. జట్టు క్రీడాకారులను, కోచ్‌లను, మేనేజర్‌ను ప్రత్యేకంగా అభినందించిన వారు.. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.